సీఎం జగన్ తన కోసం ఐదేళ్లు అడ్డగోలుగా లాబీయింగ్ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదిలేసుకున్నారు. పార్లమెంట్ కు పోటీ చేయమని చెప్పి ఆయనంటే పడని అసెంబ్లీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించి.. ఆయనంతటకు ఆయనే వెళ్లిపోయేలా చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేకుండా చెవిరెడ్డికి చాన్సిచ్చారు. ఇప్పుడు వేమిరెడ్డికి మరో అవకాశం లేకుండా పోయింది. ఆయనకు పార్టీ నుంచి పోవడమే మిగిలింది. తాజాగా చెవిరెడ్డికి ప్రకాశం జిల్లాలో ఇస్తున్న ప్రాధాన్యత చూస్తే ఎవరికైనా ఆయనను కూడా వదులుకోవడానికే జగన్ ఇప్పటి వరకూ రాజకీయాలు చేశారని అర్థమైపోతుంది.
వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటిచ్చారు. ప్రకాశం జిల్లాలను చెవిరెడ్డికి అప్పగిస్తున్నారు. కానీ బాలినేని మాటకు చిన్న విలువ లేకుండా పోయింది. బాలినేని వేరే పార్టీలోకి పోలేరు. పోతే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి. షర్మిలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తామన్న గ్యారంటీ ఉండదు. వైసీపీ తరపున పోటీ చేస్తే కాస్త పోటీ ఇవ్ొచ్చు. కానీ జగన్ రెడ్డి టిక్కెట్ ఇస్తానని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఒంగోలు నుంచి గిద్దలూరు వరకూ చాలా పేర్లను ప్రచారంలోకి తెస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తూంటే అత్యంత నమ్మకస్తులయిన వీరిద్దర్నీ కావాలనే అవమానించి బయటకు పంపేయాలనుకుంటున్నారని ఎవరికైనా అనిపిస్తే అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే వ్యవహారాలన్నీ అలాగే నడుస్తున్నాయి. ఆయన నిజంగానే అలా చేస్తున్నారా.. లేకపోతే సలహాదారుడి ఉచ్చులో పడి గిలగలలాడిపోతున్నారా అన్నది ఆయనను చూస్తున్న వారికీ అర్థం కావడం లేదు.