జగన్ రెడ్డి విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చెప్పే ఘటన ఢిల్లీలో జరిగింది. ఆయన దగ్గర ఇక విషయం లేదని రెండు నెలల్లో ఆయన కుర్చీ దిగిపోతారని.. ఆయనను అంటి పెట్టుకుని ఉంటే తామూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని కీలక నేతలు ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు.
జగన్ రెడ్డి తీరుపై అలిగి ఎన్నికల్లో పోటీ చేయనని అనుచరులకు చెప్పి ఢిల్లీ వెళ్లి పోయిన వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వెళ్లింది. సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయన డిన్నర్ కి మీ ఇంటికే వస్తారు. రెడీగా ఉండండి అని సమాచారం ఇచ్చారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి రెడీ చేస్తారని అనుకున్నారు.. కానీ వేమిరెడ్డి సింపుల్గా… తాము ఉండటం లేదని చెప్పేశారు. అంటే మొహం మీదనే తలుపేసేశారు. ఎక్కడ వస్తాడో అని.. చెప్పి.. భార్యను తీసుకుని దుబాయ్ కు వెళ్లిపోయారు. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమయింది.
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లుగా మార్చి.. అనిల్ అనుచరుడ్నే ఇంచార్జ్ గా పెట్టారు. వైసీపీ కోసం తాను ఎంత చేసినా ఇదేం అవమానమనుకున్న ఆయన… తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ తరపు నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే నెల్లూరులో జగన్ రెడ్డికి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది.