ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంది. రాజ్యసభ చైర్మన్‌గా పార్లమెంట్ సమావేశాల్లో వెంకయ్యనాయుడు కీలకంగా వ్యవహరించారు. అయితే కరోనా జాగ్రత్తలు అత్యంత పకడ్బందీగా తీసుకున్నారు. అయినప్పటికీ… ఎలా సోకిందో కానీ.. వెంకయ్యకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
వెంకయ్యనాయుడుకు కరోనా సోకడంతో ఆయన కుటుంబసభ్యులకు… సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. మిగతా వారికి నెగెటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వెంకయ్యనాయుడు వయసు పెద్దది కావడంతో… ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది.