పవన్ కల్యాణ్ కోసం చాలామంది దర్శకులు, నిర్మాతలు క్యూలో ఉన్నారు. అటు రాజకీయాలు, ఇటు సినిమా అంటూ రెండు పడవల ప్రయాణం చేయడం వల్ల… ఆయన ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు. అయితే… కథల తాకిడి.. మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో దర్శకుడు కూడా పవన్ కోసం కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆయనే పరశురామ్.
సర్కారు వారి పాట తరవాత… నాగ చైతన్యతో ఓ సినిమా చేయాలి. `నాగేశ్వరరావు` అనే టైటిల్ తో ఓ కథ రెడీ చేశాడు పరశురామ్. కానీ.. చైతూ వెంకట్ ప్రభు సినిమాని పట్టాలెక్కించడం వల్ల…. పరశురామ్ వెయిటింగ్ లో ఉండాల్సివచ్చింది. ఈలోగా… ఖాళీగా ఉండడం ఎందుకని పవన్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు టాక్. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఇది వరకే పరశురామ్ కి అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన దగ్గర పవన్ కల్యాణ్ డేట్లు ఉన్నాయి. అందుకే పరశురామ్ తో ఓ కథ రెడీ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కథ రెడీ అయ్యాక….అది పవన్ కి వినిపిస్తారు. ఒకవేళ పవన్ కి కథ నచ్చి, పట్టాలెక్కించే సమయం లేకపోతే, ఆ కథని అప్పుడు మరో హీరోకి సెట్ చేస్తారు.