‘ఇంటిలిజెంట్’ తరవాత వినాయక్ నుంచి మరో సినిమా రాలేదు. నందమూరి బాలకృష్ణతో వినాయక్ ఓ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. సి.కల్యాణ్ కూడా అడ్వాన్సులు ఇచ్చేశాడు. అయితే బాలయ్య ప్రస్తుతం వేర్వేరుసినిమాలో బిజీ అయిపోయాడు. సో.. వినాయక్ మరో హీరోని వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వినాయక్ వెంకటేష్‌ని కలిశాడని, ఓ కథ చెప్పాడని, వెంకీ కూడా ఓకే అనేశాడని ప్రచారం జరిగింది. అయితే… అదంతా ఉత్తిదే అని తేలింది. వినాయక్ – వెంకీ కాంబినేషన్ లేదని, అసలు… ఈమధ్య వారిద్దరూ కలుసుకోనేలేదని.. వెంకటేష్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశాడు. “ఆ వార్తల్లో నిజం లేదు. వినాయక్‌తో సినిమా అనే ఊసే రాలేదు. వెంకటేష్ ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఆ తరవాత త్రివిక్రమ్ సినిమా ఉండొచ్చు. ఇవి మినహా మరే కొత్త చిత్రాన్నీ ఒప్పుకోలేదు” అని క్లారిటీ ఇచ్చేశాయి.