వెంకటేష్, అనిల్ రావిపూడి.. పర్ఫెక్ట్ కాంబినేషన్. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో వెంకీ ఆరితేరిపోయాడు. అలాంటి సబ్జెక్ట్ లు రాసుకోవడంలో అనిల్ పండిపోయాడు. అందుకే ఇద్దరి కాంబోకి అంత క్రేజ్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తరవాత వీరిద్దరూ మళ్లీ జట్టు కట్టబోతున్నారు. అయితే ఇది ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీ కాదు. పూర్తిగా కొత్త కథ. పల్లెటూరు, అనుబంధాల చుట్టూ సాగబోతోందట. ఈమధ్య అనిల్ రావిపూడి కథల్లో సోషల్ కాజ్ కానిపిస్తోంది. ఆడపిల్లల్ని పులిలా పెంచాలని ‘భగవంత్ కేసరి’ ద్వారా చెప్పాడు. ఈసారి వెంకీ కథలోనూ ఓ మంచి సోషల్ మెసేజీ ఉండబోతోందట. పుట్టిన ఊరినీ, స్నేహితుల్ని మర్చిపోకూడదన్న కాన్సెప్ట్ తో ఓ ఎంటర్టైన్మెంట్ కథని రాసుకొన్నాడట అనిల్ రావిపూడి. వేసవిలో ఈ చిత్రాన్ని మొదలు పెట్టి, 2025 సంక్రాంతికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2024 సంక్రాంతి బరిలో దిల్ రాజు సినిమాలేం లేవు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. ఈసారి సంక్రాంతి బరిలో తన సినిమాని నిలపడమే ధ్యేయంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. వెంకీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సొంతూరు, స్నేహితుల కాన్సెప్ట్ అంటే.. పండక్కి పర్ఫెక్ట్ యాప్ట్. సో… 2025 సంక్రాంతికి వెంకీ మామని థియేటర్లో చూడ్డానికి రెడీ అయిపోవొచ్చన్నమాట.