టాలీవుడ్ లో మరో సక్సెస్ ఫుల్ కాంబో సెట్ అయ్యింది. ఎఫ్ 2 ఫ్రాంచైజ్ తో అలరించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి కలసి ఓ సినిమా చేయనున్నారు. దిల్రాజు నిర్మాత. కథ దాదాపుగా సిద్ధమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రం హీరోయిన్ గా త్రిష పేరుని పరిశీలిస్తున్నారు. దాదాపు ఆమెనే ఫైనల్ అయ్యే అవకాశం వుంది. నమో వెంకటేశ చిత్రంలో కలసి అలరించారు వెంకీ, త్రిష. ఇప్పుడు మరోసారి జతకడుతున్నారు. ఇది కుటుంబం, పల్లెటూరి నేపథ్యాల్ని మేళవించిన కథని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి తన బ్యానర్ నుంచి శతమానం భవతి పార్ట్ 2 విడుదల చేయాలని భావించారు దిల్ రాజు. అయితే ఇప్పుడా స్థానంలో వెంకీ, అనిల్ సినిమా తీసుకురానున్నారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాని పండగ వైబ్ తోనే రూపొందిస్తున్నారు.