మామూలుగా అయితే ‘నారి నారి నడుమ మురారి’ అనాలి. మురారి అంటే కృష్ణుడు! తెలుగు ప్రేక్షకుల్లో వెంకటేశ్‌కి కృష్ణుడి టైప్ ఇమేజ్ లేదు. ఆయనది రాముడు మంచి బాలుడు టైప్ ఇమేజ్. ఎక్కడో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి సినిమాలు తప్పిస్తే వెంకీ ఇద్దరు కథానాయికలతో రొమాన్స్ చేసిన చిత్రాలు తక్కువే. ఈ ఐదారేళ్లతో అయితే అసలే లేవు. అందుకని, ‘ఎఫ్ 2’లో వర్కింగ్ స్టిల్ ఒకటి ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. ఇద్దరు విదేశీ భామల మధ్య వెంకటేశ్ లుంగీ కట్టుకుని ఇచ్చిన ఫోజు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. వెంకీ మాస్ అని అభిమానులు సంబరపడుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్… అనేది క్యాప్షన్. ఈ రోజుతో ప్రాగ్ షెడ్యూల్ పూర్తి కానుంది. అక్కడ రెండు పాటలు తీశార్ట! ఒకటి హీరో హీరోయిన్ల మీద, మరొకటి హీరోల మీద అని సమాచారం. అక్కడ తీసిన సాంగ్ వర్కింగ్ స్టిల్ ఇది.