సరిలేరు నీకెవ్వరు…తో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఆ వెంటనే ఎఫ్ 3ని పట్టాలెక్కించి, సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకున్నాడు. కానీ కరోనాతో ప్లానింగులన్నీ తారుమారు అయ్యాయి. దాంతో… ఎఫ్ 3ని పక్కన పెట్టి, ఈలోగా మరో హీరోతో ఓ సినిమా చేస్తాడని ప్రచారం మొదలైంది. అనిల్ రావిపూడి కథతో… ఓ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం కూడా జరుగుతుంది. కాకపోతే.. ఎఫ్ 3పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ సినిమా చేయడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. 2021 సంక్రాంతి తరవాత.. కాల్షీట్లు ఇస్తానని వెంకటేష్ మాట ఇచ్చాడట. ఇక వరుణ్‌తేజ్‌ని ఒప్పించడమే తరువాయి. ఎఫ్ 3.. లాంటి సినిమాని వరుణ్ వదులుకోడు. పైగా వెంకీనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎఫ్ 3 స్క్రిప్టు రెడీగా వుంది. సినిమాని చాలా వేగంగా తీయడంలో అనిల్ రావిపూడి సమర్థుడు. 2021 వేసవికి ఈ సినిమాని సిద్ధం చేసేయగలడు. కాబట్టి.. ఎఫ్ 3 అతిత్వరలో పట్టాలెక్కడం ఖాయంగా అనిపిస్తోంది.