బిగ్ బాస్ 2 చివరి అంకానికి చేరుకుంది. దాదాపు 110 రోజుల పాటు ఇంటిల్లిపాదినీ టీవీలకు అతుక్కుపోయేలా చేసిన బిగ్ బాస్‌కి ఈ ఆదివారంతో శుభం కార్డు పడబోతోంది. బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరు? కౌశల్ ఆర్మీ తన బలం చూపించుకుంటుందా? లేదంటే…. కౌశల్ ని కాదని మరొకరికి టైటిల్ ఇస్తారా అనే ఆసక్తి అంతటా నెలకొంది. బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నదానిపై బయట బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఫైనల్‌కి అతిథిగా ఎవరొస్తారు? అనే ఉత్సుకత కూడా ఉంది. బిగ్ బాస్ 1 ని నడిపించిన ఎన్టీఆర్ ఈ ఫైనల్లో అతిథిగా వస్తారని ప్రచారం జరిగింది. ఇంకొంతమంది స్టార్ హీరోల పేర్లూ వినిపించాయి. అయితే బిగ్ బాస్ ఫైనల్‌కి గెస్ట్‌గా వెంకటేష్ రానున్నాడని తెలుస్తోంది. మాటీవీ బృందం వెంకీని సంప్రదిస్తే.. `ఓకే` అనేశాడట. దాంతో ఈ ఫైనల్‌కి వెంకీని మాటీవీలో చూడడడం, ఆయన ద్వారానే బిగ్ బాస్ 2 విన్నర్‌ని ఎనౌన్స్ చేయడం చూసేయొచ్చు. బిగ్ బాస్ తమిళ వెర్షన్ ఫైనల్‌కి అతిథిగా విజయ్ దేవరకొండ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన `నోటా` వచ్చే వారం విడుదల కానుంది. ఆ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్.. తమిళ బిగ్ బాస్‌లో సందడి చేయనున్నాడని సమాచారం.