ప్రతీ హీరోకీ ఓ కలల సినిమా అంటూ ఉంటుంది. వెంకటేష్‌కీ ఉంది. `వివేకానంద` కథని సినిమాగా తీయాలన్నది తన కల. ఈ విషయం చాలాసార్లు చెప్పాడు. వివేకానంద బోధనల ప్రభావం తనమీద చాలా ఉందని వెంకీ ఒప్పుకుంటాడు. అందుకే ఆయన కథ చెప్పాలన్నది తన ఆశ. ఓసారి ఈ ప్రాజెక్టు స్క్రిప్టు వరకూ వెళ్లింది.నీలకంఠతో కొన్ని రోజులు ఈ స్క్రిప్టుపై తర్జన భర్జనలు పడ్డారు. అయితే.. సినిమాగా ఈ ప్రాజెక్టు వర్కవుట్ కాదని తేలడంతో.. పక్కన పెట్టారు.
ఇప్పుడు ఈ వివేకానంద టాపిక్ ఎందుంకంటే, సరిగ్గా వెంకీలానే కొరటాల శివకూ వివేకానంద కథతో సినిమా తీయాలని అనిపిస్తోందట. తనకు వివేకానందుడే స్ఫూర్తి అని, ప్రపంచానికి తన కథనిచెప్పాలనుకుంటున్నానని అంటున్నాడు కొరటాల. `గాంధీ` స్థాయిలో అంతర్జాతీయ చిత్రంగా ఈ కథని మలచాలని భావిస్తున్నాడట కొరటాల. ఇప్పుడు ఓటీటీలు, వెబ్ సిరీస్‌లు అంటూ కొత్త వేదికలు వస్తున్నాయి. ఎలాంటి కథైనా చెప్పగల సౌలభ్యాలు కనిపిస్తున్నాడు. బడ్జెట్ పరిధులూ లేవు. కాబట్టి… వివేకానంద ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లడానికి ఇదే సరైన తరుణం. ఈ కథలో నటించాలని ఓ హీరో, ఈ కథ తీయాలని ఓ దర్శకుడు తాపత్రయపడుతున్నారు. వాళ్లిద్దరూ కలవడమే ఆలస్యం.