వెంకటేష్ అంటే రాజా.. బొబ్బిలి రాజా, కొండవీటి రాజా, కొండపల్లి రాజా… అంతేకాదు. రీమేక్ రాజా కూడా. ఎందుకంటే వెంకటేష్ చేసినవాటిలో సగానికి పైగా రీమేక్స్ ఉన్నాయి. వాటిలో దాదాపుగా అన్నీ హిట్సే. గత కొంతకాలంగా వరుసగా ఆయన రీమేక్ సినిమాలే చేస్తున్నారు. గోపాల – గోపాల, దృశ్యం, గురు, నారప్ప, దృశ్యమ్ 2.. ఇవన్నీ రీమేకులే. ఇందులో నారప్ప ఒక్కటే అనుకున్న ఫలితాన్ని తీసుకురాలేదు. ఇప్పుడు లేటెస్టుగా విడుదలైన దృశ్యమ్ 2కి పాజిటీవ్ స్పందన వస్తోంది. ఓ రకంగా ఓటీటీలో ఇది సూపర్ హిట్ సినిమా అనొచ్చు. అలా వెంకీకి రీమేక్ మరోసారి కలిసి వచ్చినట్టైంది. అతి తక్కువ బడ్జెట్లో, సింగిల్ షెడ్యూల్ లో సురేష్ బాబు ఈ సినిమాని పూర్తి చేశాడు. అమేజాన్ మంచి రేటుకి ఈ సినిమా కొనుక్కుంది. దాదాపుగా 15 కోట్ల వరకూ టేబుల్ ప్రాఫిట్ దక్కించుకుందని సమాచారం. ఇలా ఏ రూపంలో చూసినా వెంకీ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడిపోయినట్టే. ఈ స్ఫూర్తితో వెంకీ మరిన్ని రీమేక్ సినిమాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని వెంకీతో రీమేక్ చేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సురేష్ బాబు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారేమో చూడాలి.