అజ్ఞాతవాసిలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తాడని చిత్రబృందమే చెప్పేసింది. తీరా ఈ రోజు అజ్ఞాతవాసి చూస్తే వెంకీ ఎక్కడా కనిపించలేదు. వెంకీ పాత్రని దాస్తున్నారని, విడుదలైన రెండు మూడు రోజుల తరవాత వెంకీ సీన్లను కలుపుతారని, రిపీటెడ్ ఆడియన్స్ కోసం చిత్రబృందం ఈ ఎత్తుగడ వేయనున్నదని తెలుగు 360 ముందే చెప్పింది. అది ఈరోజు నిజమైంది. అజ్ఞాత వాసిలో వెంకీ లేడు. ఆయన నటించిన సన్నివేశాన్ని సంక్రాంతి రోజున కలుపుతారు. అదే కాదు.. దానికి మరో రెండు కొత్త సీన్లు జోడిస్తారు. వాటి కోసమైనా పవన్ ఫ్యాన్స్ మళ్లీ వస్తారన్నది చిత్రబృందం ఆశ. అయితే ఇప్పటికే వస్తున్న డివైడ్ టాక్ చూస్తుంటే.. అజ్ఞాతవాసిది అత్యాసే అనిపిస్తుంది. ‘వెంకీ వచ్చాక చూద్దాంలే’ అని ప్రేక్షకులు సినిమాకి వెళ్లాలన్న ప్రయత్నాన్ని వాయిదా వేసుకునే ప్రమాదం కూడా ఉంది. అలాగైతే… వెంకీ ఎఫెక్ట్ ఈ సినిమాపై ప్రతికూలంగా పడే అవకాశాలున్నాయి. మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో??