దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత మారుతి డైరెక్షన్లో వెంకటేష్ ‘బాబూ బంగారం’ పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. కామెడీ పోలీస్‌గా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో వెంకటేష్‌తో నవ్వులు పూయించే పనిలో వున్న డైరెక్టర్ మారుతి ఈ కథను వెంకటేష్ కోసం, అతని ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశాడట. ఈ చిత్రం షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్‌లో జరుగుతోంది. గతంలో చాలా సినిమాల్లో తన కామెడీతో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసిన వెంకటేష్ ఈసారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ని అలరించబోతున్నాడు.
ఈ చిత్రం తర్వాత వెంకటేష్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా స్టార్ట్ కానుంది. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘దృశ్యం’ చిత్రం శ్రీప్రియ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ అయి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ‘దృశ్యం’ మలయాళ వెర్షన్ డైరెక్టర్ జీతు జోసెఫ్‌తో ఓ సినిమా చెయ్యాలని వెంకటేష్ ఉవ్విళ్ళూరుతున్నాడు. జీతు కూడా వెంకటేష్‌తో తెలుగులో సినిమా చేసేందుకు ఓకే చెప్పడమే కాకుండా ఓ కత కూడా వినిపించాడట. ఆ కథ వెంకీకి విపరీతంగా నచ్చడంతో ‘బాబూ బంగారం’ తర్వాత ఏప్రిల్‌లో జీతు జోసెఫ్‌తో సినిమాను స్టార్ట్ చేసెయ్యాలని భావిస్తున్నాడు వెంకటేష్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘దృశ్యం’ తర్వాత జీతు జోసెఫ్‌తో సినిమా చెయ్యాలన్న వెంకటేష్ కోరిక త్వరలోనే తీరబోతోందన్నమాట.