టాలీవుడ్లో మోస్ట్ కంఫర్ట్ బుల్ హీరో ఎవరంటే వెంకటేష్ పేరే చెబుతారంతా. కొత్త దర్శకులకు ఛాన్సులివ్వడంలోనూ, మల్టీస్టారర్ కథల్ని ఎంచుకోవడంలోనూ, ప్రయోగాలు చేయడంలోనూ వెంకీ ముందుంటాడు. పైగా నిర్మాతలతో పెద్దగా పేచీ ఉండదు. పారితోషికం విషయంలో నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నాడన్న ఫిర్యాదులు ఇప్పటి వరకూ ఒక్కటీ లేదు. అంత కంఫర్ట్ వెంకీ.
అయితే ఇప్పుడు ఏమైందో ఏమో.. ఒక్కసారిగా తన పారితోషికం డబుల్ చేశాడు. ఎఫ్ 2 వరకూ వెంకటేష్ పారితోషికం 4 నుంచి 5 కోట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. ఆమధ్య వెంకీతో సినిమా తీసి భారీగా నష్టపోయిన ఓ నిర్మాత.. వెంకీని కలిసి సినిమా చేయమంటే రూ.10 కోట్లు అడిగాడని టాక్. ఒక్కసారిగా వెంకీ పారితోషికం పెంచేయడంతో సదరు నిర్మాత షాక్ అయ్యాడట. కేవలం ఆ నిర్మాతకే ఈ `డబుల్` ఆఫరా? అని ఆరా తీస్తే… ‘ఎఫ్ 3’కీ అంతే ఎమౌంట్ కోడ్ చేశాడని తెలిసింది. వెంకటేష్ సినిమా అంటే క్లాస్ ఆడియన్స్ ఓటేస్తారు. కుటుంబ ప్రేక్షకులు వెంకీ చిత్రాల్ని ఎక్కువగా ఇష్టపడతారు. థియేటర్ పరంగా వసూళ్లు అటూ ఇటూగా వచ్చినా, టీవీల్లో, ఓటీటీ వేదికల్లో వెంకీ సినిమాల్ని రిపీటెడ్‌గా చూస్తారు. వెంకీ సినిమాకి ఛానళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. పైగా ఎఫ్ 2, వెంకీ మామ విజయాలతో వెంకీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో.. ఇదే అదును గా పారితోషికాన్ని పెంచుకున్నాడు. డిమాండ్‌ని బట్టే కదా సప్లై. అదే సూత్రం వెంకీ మామా కూడా అన్వయించుకున్నాడు.