ఇప్పటివరకూ ఎన్నో డేట్స్ మారాయి. అదిగో పులి అన్నట్టు… త్వరలో వెంకీ-తేజ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారు. కానీ, ఇప్పటివరకూ మొదలు కాలేదు. ఎందుకో సెట్స్ మీదకు వెళ్ళే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇకపై ఆలస్యం చేయకూడదని ఫిక్స్ అయ్యార్ట. వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ నెలాఖరున 26న గానీ లేదా ఏప్రిల్ 1న గానీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర చెప్పారు. ఇందులో వెంకీ సరసన శ్రియ కథానాయికగా నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. నారా రోహిత్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని చెప్పారు. వెంకీ, రోహిత్, శ్రియ… అందరి డేట్స్ కుదరడం కొంచెం కష్టం కావడం వల్ల షూటింగ్ స్టార్ట్ కావడం లేట్ అయ్యిందని తెలిపారు. ఈషా రెబ్బా సినిమాలో నటిస్తున్నారా? లేదా? అనడిగితే… ప్రస్తుతానికి శ్రియ కన్ఫర్మ్ అని తెలిపారు. ఈషాతో ఇంకా డిస్కషన్స్ కంప్లీట్ కాలేదని సమాచారం.