నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు తేజ వైపు పెద్ద హీరోలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. బాలయ్య, వెంకీలతో చెరో సినిమా చేయబోతున్నాడు తేజ. అందులో ముందుగా వెంకటేష్ సినిమానే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసుకోవడమే ఆలస్యం. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసొచ్చింది. తేజ సినిమా.. ఓ మల్టీస్టారర్ అట. ఈ సినిమాలో మరో హీరోకీ ఛాన్స్ ఉందట. రెండో హీరో పాత్ర దాదాపుగా నారా రోహిత్ కి ఖాయమైందని టాక్ వినిపిస్తోంది. రెండో పాత్రలో కొన్ని నెగిటీవ్ ఛాయలు ఉంటాయని, ఆ పాత్రకు నారా రోహిత్ అయితేనే కరెక్ట్ అని తేజ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ దశలో సుమంత్ పేరు కూడా పరిశీలించార్ట. అయితే.. సుమంత్ మరీ సాఫ్ట్‌గా కనిపిస్తాడని, విలనీ చూపించడం కష్టమని తేజ భావించాడట. అందుకే…నారా రోహిత్‌కి ఈ పాత్ర దక్కబోతోందని తెలుస్తోంది. డి.సురేష్‌బాబు నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రం నవంబరులో క్లాప్ కొట్టుకోనుందని టాక్.