కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య కెరియర్ అటు ఇటు కాకుండా మిగిలిపోయింది. సినిమాలైతే వరుసెంట చేస్తున్న స్టార్ ఇమేజ్ ని మాత్రం సంపాధించలేని చైతు కోసం ఈసారి మేనమామ విక్టరీ వెంకటేష్ రంగంలో దిగనున్నాడట. నాగ చైతన్య హీరోగా మలయాళ ‘ప్రేమమ్’ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో అనంత్ నాగ్ వేసిన క్యారక్టర్ ని తెలుగులో వెంకటేష్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.
చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే టైటిల్ ‘మజ్ఞు’ అని పెట్టబోతున్నారని టాక్. కెరియర్ పరంగా కాస్త స్థిమితం లేని చైతుకి ఇప్పుడు మామ వెంకటేష్ లిఫ్ట్ ఇవ్వనున్నాడని.. సినిమాలో వెంకటేష్ నటిస్తే సినిమాకు సూపర్ క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారట.
ప్రస్తుతం కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే పనిలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. మరి విక్టరీ ఇచ్చిన ఈ ప్రోత్సాహం చైతు సినిమాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.