‘ఓం నమోవేంకటేశాయ’ తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టలేదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అంతకుముందు కూడా యాక్టివ్ గా లేరు. కమర్షియల్ లైన్ ని ఆయన చానళ్ళ క్రితమే వదిలేశారు. అయితే ‘అన్నమయ్య’ ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’, ‘ఓం నమోవేంకటేశాయ’ తరహాలో మరో భక్తిరస సినిమా తీయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. విక్టరీ వెంకటేష్ ప్రధానపాత్రలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం వుందని వార్తలు వినిపించాయి. అయితే వెంకీ వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు.
ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా ప్రకటన ఉటుందనే కబర్లు వినిపిస్తున్నాయి. మరోసంగతేమిటంటే.. కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తాడని కూడా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకే వెళ్ళే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రస్తుతం వెంకీ, తేజ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా వుటుంది. దీనిపై ప్రకటన కూడా వచ్చేసింది. ఈ రెండు సినిమాలు ఫినిష్ అయిన తర్వాతే కొత్త సినిమా. మరి ఈ గ్యాప్ లో ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయో చూడాలి.