మలయాళం ‘దృశ్యం’ సినిమా తెలుగులో విక్టరీ వెంకటేష్ చేసి మంచి ప్రేక్షకాదరణ పొందేలా చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘గోపాలా గోపాలా’ సినిమా కూడా వెంకటేష్ కెరియర్ లో హిట్ సినిమాగానే నిలిచింది. అయితే సినిమా విడులై సంవత్సరం కావొస్తున్న వెంకటేష్ ఒక్క సినిమా కూడా ఓకే చేయకపోవడంతో సందేహాలు కలిగేలా చేసినా.. ఈమధ్య మారుతితో ‘బాబు బంగారం’ అంటూ సినిమా మొదలు చేసి అందరిని శాంత పరిచాడు వెంకటేష్.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు దర్శకుడు కార్తీక్ మాధవ్ తో కూడా కథా చర్చల్లో పాల్గొంటున్నాడనే వార్తలు వస్తున్నా వెంకటేష్ కన్ను మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ మీద పడ్డదని ఫిల్మ్ నగర్ సమాచారం. తెలుగు దృశ్యం సినిమాను అలనాటి హీరోయిన్ ఇప్పుడు దర్శకురాలు శ్రీ వాణి దర్శకత్వం వహించారు. దృశ్యం మాతృక మలయాళం సినిమాను దర్శకత్వం వహించిన ఆ దర్శకుడు పనితీరు చూసి మెచ్చిన వెంకటేష్, జీతు జోసెఫ్ తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.
వెంకటేష్ ఆలోచన ప్రకారం మారుతి ‘బాబు బంగారం’ తర్వాత జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే సినిమా చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. దర్శకుడికి కథని కూడా సిద్ధం చేయమన్నట్టు తెలుస్తుంది. అయితే రాబోతున్న దృశ్యం కాంబినేషన్ లో మళ్లీ అలాంటి సినిమానే వస్తుందా లేక మరేదైనా కొత్త జానర్ లో సినిమా తీస్తారా అన్నది తెలియాల్సి ఉంది.