కొత్త ద‌ర్శ‌కుడితో వెంకీ?!

‘సైంధ‌వ్‌’ త‌ర‌వాత వెంకీ సినిమా ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. కాక‌పోతే ఆయ‌న చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రానా నాయుడు సీజ‌న్ 2’కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు వెంకీ. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సివుంది. అది త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కుతుంది. ఈ సినిమాలో మ‌రో హీరో కూడా క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈలోగా మ‌రో కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌కూ వెంకీ ఓకే చెప్పార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న’ చిత్రం కోసం రైటింగ్ డిపార్ట్మెంట్ లో ప‌ని చేశారు నందు. ఆయ‌న వెంకీ కోసం ఓ క‌థ సిద్ధం చేసుకోవ‌డం, అది కాస్త వెంకీ వ‌ర‌కూ వెళ్ల‌డం జ‌రిగాయ‌ని స‌మాచారం. ఈ క‌థ వెంకీకి బాగా న‌చ్చింద‌ని, అందుకే వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. వెంకీ స్టైల్ లో స‌ర‌దాగా సాగిపోయే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సినిమా అని టాక్‌. రావిపూడి సినిమా పూర్త‌యిన వెంట‌నే నందు సినిమాని ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాభవన్‌లోనే చంద్రబాబు- రేవంత్ భేటీ

చంద్రబాబు ఆహ్వానానికి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. నేనే వస్తానన్న చంద్రబాబు మాటకు తగ్గట్లుగా ప్రజాభవన్‌లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ అే పేరును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరారు చేశారు....

నెల్లూరు సెంట్రల్ జైలుకు జగన్

వైసీపీ అధినేత జగన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. నాలుగో తేదీన ఆయన తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా నెల్లూరు వెళ్తారు. అక్కడ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

7 మండలాలు కాదు 5 గ్రామాల కోసం రేవంత్

ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే భేటీలో ఏడు మండలాల కోసం పట్టుబట్టాలని .. ముందుగా ఆ అంశం తేల్చిన తర్వాతనే ఇతర అంశాల జోలికి వెళ్లాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్...

అన్నవరం వచ్చేశాడు.. ఇక ఆడబిడ్డలూ వచ్చేస్తారు!

ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కాదు..పదివేలు కాదు..ఏకంగా 30వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని పునరుద్ఘటించారు. ఇంత పెద్ద మొత్తంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close