వెంకటేష్ కి రీమేక్ సినిమాలంటే మక్కువ ఎక్కువ. తన కెరీర్లో సగం.. రీమేకులే. మినిమం గ్యారెంటీ ఉంటుందన్న… నమ్మకంతో రీమేకుల్ని ఎంచుకుంటాడు వెంకీ. ఇప్పుడు చేస్తున్న `నారప్ప`, `దృశ్యమ్ 2` రెండూ పరాయి కథలే. ఈమధ్య మరో తమిళ కథపైనా వెంకీ దృష్టి పడిందని టాక్. తమిళంలో ధనుష్ చేసిన సినిమా `కర్ణన్`. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాని విడుదలకు ముందే వెంకీ కోసం సురేష్ బాబు చూసేశాడట. అది ఆయనకు నచ్చింది. వెంకీకీ చూపిస్తే… `ఇది తెలుగులో వర్కవుట్ అవ్వదేమో` అనుకుని వదిలేశాడట. అప్పుడే.. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ చూడడం, రీమేక్ రైట్స్ తీసేసుకోవడం జరిగిపోయాయి. ఒకవేళ.. వెంకీకి ఈ సినిమా నచ్చితే.. తన ఖాతాలో మరో రీమేక్ పడిపోయేది. వెంకీ వదులుకున్న కర్ణన్…. సాయికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఈసినిమాకి.. దర్శకుడెవరన్నది ఇంకా ఖరారు కాలేదు. `నారప్ప` చూశాక… ఆ సినిమా బాగుంటే, శ్రీకాంత్ అడ్డాలకే ఆ ఛాన్స్ ఇవ్వాలని బెల్లంకొండ భావిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో ఏమో..?