విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫ్యాన్స్ అంతా ఆనందంలో తేలుతున్నారు. భలే భలే మగాడివోయ్ సినిమాతో ఎలాంటి సినిమానైనా తీసి హిట్ కొడతా అని నిరూపించుకున్న మారుతికి విక్టరీ వెంకటేష్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఇన్నాళ్లు చిన్న హీరోలతోనే సినిమా చేసిన మారుతి మొదటిసారి ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు.
గోపాల గోపాల తర్వాత సినిమాల విషయంలో వెనుకడుగేసిన వెంకటేష్ ఇప్పుడు వరుసెంట సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. వెంకటేష్ మారుతిలు ఇదవరకే ‘రాధ’ సినిమాకు కమిట్ అవ్వడం కొద్దిరోజులు షూటింగ్ జరుపుకుని దానిలోని వెంకటేష్ పొలిటికల్ గెటప్ స్టిల్స్ బయటకు రావడం జరిగింది. అయితే ఆ కథ తనదంటూ ఓ అసిస్టెంట్ దర్శకుడు గొడవ చేయడం ఆ సినిమా అటకెక్కడం జరిగింది.
అయితే ఇప్పుడు ఆ అసిస్టెంట్ దర్శకుడిని కన్విన్స్ చేసో… అతని దగ్గరనుండి ఆ కథని కొనో.. మొత్తానికి మళ్లీ అదే కథతోనే సినిమా స్టార్ట్ అవ్వబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాదు సినిమా టైటిల్ కూడా ‘రాధ’ అనే పెట్టబోతున్నారట. సో మొత్తానికి ఈ ఇద్దరు కలయికతో వస్తున్న ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు వెంకటేష్ అభిమానులు.