ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఇవి మూడూ సంక్రాంతి సినిమాలే. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈరోజు విడుదల అవుతోంది. ఒక పాట మినహా ప్రమోషన్ కంటెంట్ అంతా వచ్చేసినట్టే. డాకూ నుంచి ఓ పాట, ట్రైలర్ బాకీ. వెంకీ మామలో 3 పాటలున్నాయి. అవి మూడూ విడుదలైపోయాయి. ఇక ట్రైలర్ రావాలి.
ఆడియో పరంగా చూస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మిగిలిన రెండు సినిమాల్నీ దాటేసింది. రమణ గోగుల పాడిన పాట ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. మిగిలిన రెండు పాటలూ ఎక్కేశాయి. ప్రమోషన్ ఈవెంట్స్ ని కూడా అనిల్ రావిపూడి చక్కగా ప్లాన్ చేస్తున్నాడు. వెంకటేష్‌తో దిల్ రాజు, మీనాక్షి చౌదరి, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూ చేశారు. వెంకీ తప్ప మిగిలిన వాళ్లు రకరకాల గెటప్పుల్లో ఈ ఇంటర్వ్యూకి వచ్చారు. ఆఖరికి దిల్ రాజు కూడా ఘర్షణ గెటప్ లో గన్ పట్టుకొని దిగిపోయారు. ఈ ఇంటర్వ్యూలో ఫన్ బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. సాధారణంగా టీజర్లు, ట్రైలర్లు, పాటలూ ట్రెండింగ్ లో ఉంటాయి. ఈసారి ఓ ఇంటర్వ్యూ ట్రెండింగ్ లో నిలవడం విశేషం. దీన్ని బట్టి ప్రమోషన్లలో వెంకీ సినిమా ఎంత ముందుందో అర్థం చేసుకోవొచ్చు. సినిమా తీయడం కాదు, ఇన్నోవేటివ్ గా దాన్ని ప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు అనిల్ రావిపూడి అదే చేస్తున్నాడు. ఈరోజు ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ వస్తోంది కాబట్టి.. చరణ్ సినిమాకూ ఓ ఊపు రావొచ్చు. ఇక మిగిలింది ‘డాకూ మహారాజ్నే’.