సెక్రటేరియట్ క్యాంటిన్ ను తమ వర్గం వారితో నింపేయాలని అనుకున్న జగన్ భక్త ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డికి ఖర్చులయ్యాయి కానీ ఒక్క పోస్టుకూ తన మద్దతుదారుడ్ని గెలిపించలేకపోయారు. క్యాంటిన్ కు మొత్తం పన్నెందు మంది డైరక్టర్లు ఉంటారు. వారిలో ఒక్కరంటే ఒక్కర్నీ కూడా తన వర్గీయుడ్ని గెలిపించుకోలేకపోయారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు పదకొండు మంది గెలిస్తే.. ఓ స్వతంత్ర అభ్యర్తి మరొకటి గెలిచారు.
వైసీపీ ఓడిపోయినా ఉద్యోగుల్లో తన పలుకుబడి తగ్గలేదని నిరూపించేందుకు వెంకట్రామిరెడ్డిచేయని ప్రయత్నం లేదు.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు మందు పార్టీలు ఇచ్చారు. కానుకలు ఇచ్చారు. కానీ అందరూ అన్నీ తీసుకున్నారు. పార్టీలకు వచ్చారు . కానీ ఓట్లు మాత్రం వేయలేదు. దీంతో ఆయనకు షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న ఆయన తన ఉద్యోగ సంఘాన్ని రిస్క్ లో పెట్టారు. ప్రభుత్వం దాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉంది.
త్వరలో జరగనున్న సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలలోనూ వెంకట్రామిరెడ్డి పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇపుడు వచ్చిన ఫలితంతో ఆయన తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో జగన్ రెడ్డికి తాను చాలా దగ్గర అని ఎవరికి ఎలాంటిపనులు కావాలన్నా చేయిస్తానని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత మరోసారి గట్టి పోటీ ఎదుర్కొని గెలిచారు. ఈసారి మాత్రం ఆయన పోటీ చేసే అవకాశం ఉండే పరిస్థితి లేదు.