విశాఖ రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ బాగా పెరుగుతున్న ప్రాంతాల్లో వెంకోజీ పాలెం ఒకటి. శివారు ప్రాంతమే అయినా నగరంలో కలిసిపోతోంది. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ సెంటర్ల వంటి మౌలిక సదుపాయాలు మెరుగుగ్గా ఉండటంతో అక్కడ ఇళ్లు కొని నివాసం ఏర్పరుచుకునేవారు పెరుగుతున్నారు. మద్దిలపాలెం, రుషికొండ వంటి ఐటీ హబ్‌లతో పాటు బీచ్ ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరగనుంది.
వెంకోజీ పాలెంలో చిన్న చిన్న బిల్డర్లు నిర్మించే అపార్టుమెంట్లలో డబుల్ బెడ్ రూం రూ.45 లక్షలకు లభిస్తోంది. మంచి సౌకర్యాలు ఉన్న అపార్టుమెంట్లలో అయితే రూ.70లక్షల వరకూ చెబుతున్నారు. ఈ ఏరియాలో ఎక్కువగా ఇండిరపెండెంట్ హౌస్‌లు కొనేందుకు ప్రాధాన్యం లఇస్తున్నారు. 150-200 గజాలు ఉండే ఇళ్లు 80 లక్షల నుండి 1.3 కోట్ల వరకు మార్కెట్ ఉంది. 300 గజాలు లేదా అంతకంటే ఎక్కువ అయితే కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల వరకూ చెబుతున్నారు.
బీచ్‌కు దగ్గరగా ఉండటంతో చాలా మందిఈ ప్రాంతంతో సంబంధం లేకపోయినప్పటికీ ప్రశాంత జీవనం కోసం వెంకోజీపాలెంలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. అందుకే లగ్జరీ విల్లాల నిర్మాణమం కూడా జరుగుతోంది. సౌకర్యాలు , బీచ్ వ్యూ ఆధారంగా ధరలు మూడు కోట్ల వరకూ ఉంటున్నాయి. వెంకోజీపాలెం హనుమంతవాక, మద్దిలపాలెం వంటి వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉంది, దీని వల్ల అద్దె ఆదాయం కూడా ఎక్కువగానే వస్తోంది.