ఎప్పుడో మొదలవ్వాల్సిన ఎన్టీఆర్ బయోపిక్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎన్టీఆర్ కథ చాలా పెద్దదని, దాన్ని ఆరు భాగాలుగా తీయొచ్చని, ఎక్కడికక్కడ కుదించుకుంటూ రావడానికి టైమ్ పట్టిందని అటు తేజ, ఇటు బాలయ్య చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్నది ముందస్తు ప్రణాళిక. అయితే అందులో అనూహ్యమైన మార్పు వచ్చి దసరాకే విడుదల చేయాలని బాలయ్య, తేజ ఫిక్సయ్యారు. దసరాకి మరో ఆరు నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచి షూటింగ్ నిర్విరామంగా సాగితే… దసరాకి విడుదల చేయడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఇక్కడొచ్చిన చిక్కేమిటంటే… తేజ ఆల్రెడీ వెంకటేష్‌తో సినిమా కమిట్మెంట్లో ఉండడం. దాని పనులూ ఓవైపు సాగుతుండడంతో `దసరాకి బాలయ్య సినిమా వస్తుందా` అనే డౌట్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో బాలయ్య చాలా పట్టుగా ఉన్నాడని టాక్. బాలయ్య కోసం.. వెంకీ సినిమాని తేజ పక్కన పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు వెంకీ చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. తేజ సినిమాకి తాత్కాలికంగా బ్రేకులు వేసి ఆ చిత్రాల్ని పట్టాలెక్కించాలని వెంకీ భావిస్తున్నాడట. సో.. వెంకీ – తేజ కాంబో ఆలస్యం కానున్నదన్నమాట.