ఎన్టీఆర్‌లో స్టార్ల హంగామా మామూలుగా లేదు. హీరోలు, హీరోయిన్లు కావల్సినంత మంది ఉన్నారు. కాకపోతే… కామెడీ ఆర్టిస్టులే కనిపించడం లేదు. ఆ లోటు తీర్చేస్తున్నాడు వెన్నెల కిషోర్. ఎన్టీఆర్ బయోపిక్‌లో వెన్నెల కిషోర్‌కి స్థానం దక్కింది. ఎన్టీఆర్ పర్సనల్ మేనేజర్ రుక్మాంగదరావు పాత్రని పోషిస్తున్నాడు. రుక్మాందరరావు ఎన్టీఆర్‌కి స్వయానా బామ్మర్ది. బసవతరాకంకు సోదరుడు. ఎన్టీఆర్‌కి చేదోడు వాదోడుగా ఉండేవారు. పర్సనల్ మేనేజర్‌గా నూ పనిచేశారు. ఇప్పుడు ఆ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించబోతున్నాడు. సునీల్ గైర్హాజరుతో వెన్నెల కిషోర్ స్థానం బలపడుతూ వచ్చింది. ఇప్పుడు సునీల్ రీ ఎంట్రీ ఇచ్చినా… కిషోర్ జోరు మాత్రం తగ్గడం లేదు. తమిళంలోనూ వెన్నెల కిషోర్ అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. భారతీయడు 2లో తనకి ఓ కీలక పాత్ర దక్కింది.