ఈమధ్య ప్రతీ సినిమాలోనూ వెన్నెల కిషోర్ కనిపిస్తూనే ఉన్నాడు. కానీ తనదైన మార్క్ మిస్సవుతోంది. ఒకట్రెండు రోజులకు వెన్నెల కిషోర్ కాల్షీట్లు తీసుకోవడం, నాలుగైదు సీన్లు చుట్టేయడం.. మా సినిమాలోనూ వెన్నెల కిషోర్ ఉన్నాడు అనిపించుకోవడం… ఇదే తంతు. తనకు సరైన పాత్ర పడి చాలా రోజులైంది. అయితే `రంగ్ దే`తో ఆ లోటు తీరిందని సమాచారం. నితిన్ – కీర్తి సురేష్ కాంబోలో రూపొందిన చిత్రం రంగ్ దే. ఈవారమే విడుదల అవుతోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌కి మంచి పాత్ర పడిందని ఇన్సైడ్ వర్గాల టాక్. పదే పదే… బకరా అయ్యే పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయిస్తాడని, తన పాత్ర ఈ సినిమాకి హైలెట్ అవ్వబోతోందని తెలుస్తోంది.
నితిన్‌కి `చెక్` గట్టి దెబ్బ కొట్టింది. ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ ఫలితం రాలేదు. అయితే `రంగ్ దే`తో మళ్లీ ట్రాక్‌లోకి వస్తానన్నది నితిన్ నమ్మకం. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతాయని నితిన్ భావిస్తున్నాడు. ఇటీవల నితిన్ ఈ సినిమా చూశాడట. అవుట్ పుట్ పై చాలా సంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఈమధ్య లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లు రావడం లేదు. ఆ జోనర్లో నితిన్ సినిమా చేస్తే.. దాదాపుగా హిట్టు కొట్టేస్తాడు. పైగా పీసీ శ్రీరామ్ తనకు లక్కీ. తనతో చేసిన ఇష్క్ బాగా ఆడింది. ఈ సెంటిమెంట్లన్నీ కలిసొస్తాయని నితిన్ గట్టిగా నమ్ముతున్నాడు.