‘‘జగన్ను చూస్తే జాలేస్తోంది. చాలా కష్టపడుతున్నాడు అన్న. పాపం ఐదు రోజులు యాత్ర, మళ్లీ కోర్టుకు, మళ్లీ యాత్రకు.. ఆయన కష్టం ఎవరూ తీర్చలేనిది’’ . ఇవీ జగన్ మీద తాజాగా కమెడియన్ వేణు మాధవ్ వేసిన సెటైర్స్. జగన్ పాదయాత్ర మొదలైనప్పటినుంచీ జగన్ ని టార్గెట్ చేసి, టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో జగన్ పాదయాత్రను ఉద్దేశించి వేణు మాధవ్ ఇలా వ్యంగంగా మాట్లాడారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించి అప్పుడు కూడా ఇదే తరహాలో వైసీపీ అధినేత కమెడియన్ వేణు మాధవ్ వ్యంగాస్త్రాలు సంధించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని.. వేణు మాధవ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సచివాలయానికి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఏం లేదు. ఊరకే వచ్చా. సీఎంని చూసి చాలా రోజులైంది. బెంగొచ్చి వచ్చా, కలిసి మాట్లాడా.. వెళుతున్నా’ అని చెప్పారు.