ఏంసీఏ హిట్టు తరవాత.. `ఐకాన్` అనే సబ్జెక్టు తయారు చేసుకున్నాడు వేణు శ్రీరామ్. కొత్త కథలు చేద్దాం, ప్రయోగాలు చేద్దాం… అనే మూడ్ లో ఉన్న అల్లు అర్జున్‌కి అప్పట్లో ఆ కథ బాగా నచ్చింది. దిల్ రాజు నుంచి ప్రకటన కూడా వచ్చింది. కానీ.. మనసు మార్చుకున్న బన్నీ.. ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టాడు. ఈమధ్య దిల్ రాజు కూడా `ఐకాన్ సినిమా ఉంది` అని హింట్ ఇచ్చారు. కానీ షరతు ఒక్కటే. `వకీల్ సాబ్` హిట్టవ్వాలి. ఆ సినిమా హిట్టయితే, దర్శకుడిగా వేణు శ్రీరామ్ కి పేరొస్తుంది. అది `ఐకాన్`కి ప్లస్ అవుతుంది. అందుకే.. వకీల్ సాబ్ రిజల్ట్ కోసం బన్నీ కూడా వెయిటింగ్ లో ఉన్నాడని టాక్.
ఇప్పుడు వకీల్ సాబ్ వచ్చేసింది. పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెచ్చేసింది. ఓవరాల్ గా ఈ సినిమాకి హిట్.. సూపర్ హిట్ టాక్ నడుస్తోంది. సో.. వేణు శ్రీరామ్ తదుపరి సినిమాకి హీరోల వెంట పడాల్సిన పనిలేదు. `ఐకాన్` కథ ఎలాగూ రెడీగానే ఉంది. బన్నీ ఓకే అనాలి అంతే. కాకపోతే.. దిల్ రాజు దగ్గర రెండో ఆప్షన్ కూడా ఉందని టాక్. బన్నీ కాకపోయినా, మరో స్టార్ హీరోతో అయినా ఈ ప్రాజెక్టు మొదలెడదామనుకుంటున్నాడట. వేణు శ్రీరామ్ తదుపరి ప్రాజెక్టు.. `ఐకాన్` అయ్యే అవకాశాలే పుష్కలం.