నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం… తీసింది రెండు సినిమాలే అయినా, తనదైన ముద్ర వేసిన దర్శకుడు వేణు ఉడుగుల. సామాజిక బాధ్యత సినిమాలకూ ఉందని నమ్మి, అలాంటి కథలతోనే ప్రయాణం చేస్తున్నారాయన. విటపర్వం చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలు, అవార్డులూ దక్కాయి. ఫిల్మ్ ఫేర్‌లో ఉత్తమ నటిగా సాయి పల్లవి, ఉత్తమ సహాయ నటిగా నందితాదాస్లు అవార్డులు గెలుచుకొన్నారు కూడా.
ఇప్పుడు వేణు ఉడుగుల తన మూడో సినిమాపై కసరత్తు చేస్తున్నారు. వెంకటేష్ కోసం ఆయన ఓ కథ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరగుతున్నాయి. ఇదో మల్టీస్టారర్ అని సమాచారం. వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. ఆ యువ హీరోలెవరన్నది త్వరలో తెలుస్తుంది. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నారు. గురువారమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. బహుశా.. అనిల్ రావిపూడి సినిమా పూర్తయ్యాకే వేణు ఉడుగుల చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.