‘విరాట పర్వం’ తో నక్సల్ నేపధ్యంలో ఒక ప్రేమకథని చెప్పాడు దర్శకుడు వేణు ఉడుగుల. సినిమా కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయినా మంచి ప్రసంసలు దక్కాయి. నిజాయితీ గల కథని తెరకెక్కించాడనికి వేణు ఉడుగులని అందరూ అభినందిచారు. ఇప్పుడాయన కొత్త సినిమా జోనర్ ఫిక్స్ అయింది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని చేయబోతున్నాడు వేణు ఉడుగుల. ప్రస్తుతం కథ ని పూర్తి చేసే పనిలో వున్నాడు వేణు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు.
”ఈసారి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నా. కథ సిద్ధమవుతోంది. హీరోతో పాటు మిగత వివరాలన్నీ త్వరలో బయటికొస్తాయి. హీరో ప్రధానంగా సాగే కథ అది. మంచి కమర్షియల్ విలువలతో తీస్తా. ఆ కథకి నిజ జీవిత సంఘటనల ప్రభావమేవీ లేదు. ఒక కల్పిత కథగా తీస్తున్నా’’ అని వెల్లడించాడు. ‘విరాటపర్వం’లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం మైనస్ గా మారింది. సినిమా బాక్సాఫీసు ముందు తేలిపోవడానీ ఇదీ ఒక కారణం. అందుకే ఈసారి పక్కా కమర్షియల్ బాటలో నడవాలని ఫిక్స్ అయ్యాడు వేణు.