రాఫెల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు రక్షణ శాఖ కార్యాలయం నుంచి దొంగతనానికి గురయ్యాయని.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం.. తెలివిగా వ్యవహరించానని అనుకుంది. ఆ పత్రాలను ప్రచురించిన హిందూ పత్రికపై దొంగతనం అభియోగం మోపానని జబ్బలు చరుచుకుంది. కానీ.. అందరూ… ఆ పత్రాలను.. కేంద్రమే మాయం చేసిందనే… కోణంలో విమర్శలు చేయడమే కాదు.. స్కాంను బయటకు రాకుండా… దొంగతనాలు కూడా చేస్తున్నారన్న అభిప్రాయంతో విమర్శలు ప్రారంభించారు. ప్రజల్లోనూ ఇదే అభిప్రాయం ఏర్పడిపోయింది. దీంతో మోడీ సర్కార్ తాము తెలివిగా.. సుప్రీంకోర్టులో వాదించలేదని.. అతి తెలివిని ప్రదర్శించామని తెలుసుకుంది. వెంటనే… తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తోంది.
రఫేల్ పత్రాలు చోరీ కాలేదని.. కేంద్రం తాజాగా ప్రకటన చేసింది. హిందూ పత్రిక, పిటిషనర్లు వాడింది కేవలం ఫొటో కాపీలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అసలు ప్రతాలకు సంబంధించిన ఫొటో కాపీలనే పిటిషన్లు కోర్టు ముందు ఉంచారన్నారు. తాను సుప్రీం కోర్టులో చెప్పినదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. వాటిని ఎవరు దొంగలించలేదని, ప్రభుత్వం వద్దే భద్రంగా ఉన్నాయని చెప్పుొచ్చారు. రఫేల్ ఒప్పందం పత్రాలు చోరీకి గురయ్యాయని, దానిపై విచారణ జరుగుతోందని బుధవారం వేణుగోపాల్ కోర్టుకు వెల్లడించారు. రఫేల్ పత్రాలనే సరిగా సంరక్షించలేని ఈ ప్రభుత్వం దేశానికి ఎలా రక్షణ కల్పిస్తుందన్న ..దేశవ్యాప్తంగా తలెత్తడంతోనే కేంద్రం ఇలా వెనుకడుగు వేసింది.
రాఫెల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. సుప్రీంకోర్టుకు పదేపదే అబద్దాలు చెబుతోంది. ఆ డీల్ పై విచారణకు అడ్డు పడుతోంది. మరో వైపు.. రాఫెల్ విషయంలో.. దేశానికి నష్టం కలిగించే అనేక అంశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిపై చర్చ జరగకుండా.. దేశభక్తి పేరుతో.. రాజకీయం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మొత్తానికి రాఫెల్ విషయంలో.. మోడీ సర్కార్.. వరుసగా… తప్పులు చేస్తోందన్న అభిప్రాయం మాత్రం దేశ ప్రజల్లో ఏర్పడుతోందట..!