పుష్ప సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సౌత్ లో కంటే నార్త్ లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2కి సంబంధించిన స్క్రిప్టు పనులు శర వేగంగా సాగుతున్నాయి. పుష్ప 1కీ పుష్ప 2కీ నటీనటుల పరంగా పెద్దగా మార్పులేం ఉండవు. పార్ట్ 1లో ఎవరైతే కనిపించారో, వాళ్లే పార్ట్ 2లోనూ ఉంటారని, కొత్త పాత్రలు రావని సుకుమార్ ముందే స్పష్టం చేశాడు. అయితే పుష్ప 2లో ఓ కొత్త పాత్ర ఎంటర్ కాబోతోందని టాక్.
ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ ఇంద్రజ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2లో ఓ కీలకమైన పాత్ర కోసం చిత్ర బృందం ఇంద్రజని సంప్రదించిందని సమాచారం. ఈ పాత్ర చేయడానికి ఇంద్రజ కూడా సిద్ధంగా ఉందట. పుష్ప 2 కోసం ఎంచుకున్న తొలి నటి ఈమెనే. చివరి నిమిషంలో స్క్రిప్టులో చేసుకున్న మార్పుల వల్ల ఒకట్రెండు కొత్త పాత్రలకు అవకాశం దొరికిందని, అందుకే ఇంద్రని ఖరారు చేశారని టాక్. ఈ పాత్ర… పుష్పరాజ్ ఛైల్డ్ ఎపిసోడ్‌తో లింక్ అవుతుందని తెలుస్తోంది. పుష్ప లో ఛైల్డ్ ఎపిసోడ్ కొంచెమే చూపించారు. పుష్ప 2లో ఆ ఎపిసోడ్ కీలకం కానుందని తెలుస్తోంది.