హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఉన్న కార్పొరేట్ ఆస్పత్రిపై… ఓ కేసు నమోదయింది. ఈ ఫిర్యాదు చేసింది ఎవరో కానీ… ఫిర్యాదు వచ్చింది మాత్రం.. ఓ ముఖ్యమైన ప్రదేశం నుంచి. ఆ ముఖ్యమైన ప్రదేశం.. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ఉండే ప్రగతి భవన్ నుంచి. ఆ కేసు… మరీ అంత తీవ్రమైనది కాదు కానీ.. తీవ్రమైనదే. ప్రగతి భవన్లో ఉండే.. ఓ కుక్క హఠాత్తుగా అనారోగ్యానికి గురంది. యానిమల్ కేర్ అనే కార్పొరేట్ స్టైల్ … జంతువుల ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే ఆ కుక్క మరణించిందని… యానిమల్ కేర్ ఆస్పత్రి యాజమాన్యంపై.. ప్రగతి భవన్ నుంచి ఫిర్యాదు వచ్చింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
చనిపోయిన ఆ కుక్క పేరు హస్కీ. కేసీఆర్ కుటుంబసభ్యులకు ఆ శుకనం అంటే.. ఇష్టమని… అందుకే… అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్న హస్కీ మరణాన్ని జీర్ణించుకోలేక.. ఆస్పత్రిపై ఫిర్యాదు చేశారని భావిస్తున్నారు. పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో కానీ.. హస్కి మరణం మాత్రం ప్రగతి భవన్ వర్గాలను.. విషాదంలోకి నింపిందని…ఆవేదన కలిగించిందని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారానే అర్థమవుతోందంటున్నారు. అయితే ఎవరు ఫిర్యాదు చేశారో మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా… తమ బంధువు చనిపోయారని.. ఆస్పత్రుల్లో విధ్వంసకర దృశ్యాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో.. ఇది చాలా కామన్. అందుకే.. డాక్టర్లు తరచూ సమ్మె చేస్తూంటారు. వారిని బుజ్జగించడానికి ప్రభుత్వ యంత్రాంగం తంటాలు పడుతుంది. ఇలాంటి ఘటనలు అంతకంతకూ పెరిగిపోయే సరికి.. కేంద్ర ప్రభుత్వమే.. వైద్యులపై దాడి చేసే వారిని కట్టడి చేయడానికి కఠిన శిక్షలతో ఓ చట్టం తీసుకొచ్చింది. అలాంటి ఘటనలు తగ్గాయో లేదో కానీ వైద్యుల నిర్లక్ష్యం ఉంటే మాత్రం.. పోలీసుల వద్దకు వెళ్తున్న వారు ఎక్కువయ్యారు. ఆ తరహాలో.. ప్రగతి భవన్ వర్గాలు కూడా… జంతువుల ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ ఆస్పత్రి చిన్నది కాదు.. జంతువులకు చికిత్స అందించడంలో.. కార్పొరేట్ ఆస్పత్రి… !