హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు విద్యార్థులతో రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీక్షలు విరమింపజేసే యత్నం చేస్తున్నారు. రోహిత్ సహవిద్యార్థులు నలుగురిపై నిన్న సస్పెన్షన్ ఎత్తేసిన వీసీ, ఇవాళ చర్చలకు రావాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆహ్వానించారు. అయితే విద్యార్థులు మాత్రం వీసీని తొలగించటం, రోహిత్ మృతికి బాధ్యులకు శిక్ష పడటం తదితర తమ డిమాండ్లను అంగీకరించేవరకు ఆందోళన విరమించేది లేదని ఇవాళ తేల్చి చెప్పారు. తమ దృష్టిలో ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన అప్పారావు వీసీయే కాదని, అతను పరారీలో ఉన్న ఒక నేరస్తుడని విద్యార్థులు ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సస్పెన్షన్ ఎత్తివేత సర్క్యులర్ కాపీని తీసుకోబోమని తెలిపారు. అప్పారావు తక్షణమే పోలీసులముందు లొంగిపోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఏడుగురు విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తోంది.