బాలీవుడ్ లో మేటరే వేరు. అక్కడ దేన్నయినా సరే ప్రచారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖరికి పెళ్లి కూడా. సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిపరీతమైన మైలేజీ. ఇప్పుడు కత్రినా – విక్కీల పెళ్లికీ అంతటి మైలేజీ ఉంది. ఈనెల 9న వీరిద్దరి పెళ్లి రాజస్థాన్లో జరగబోతోంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచీ… వీళ్లదే హడావుడి అంతా. బాలీవుడ్ అంతా.. ఈ పెళ్లిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. రాజస్థాన్ లోని సిక్స్సెన్సెస్ ఫోర్టులో కత్రినా- విక్కీల పెళ్లి జరగబోతోంది. కేవలం 400మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి.
ఈ పెళ్లికి హాజరయ్యేవారు సెల్ఫీలు తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిషిద్ధమని.. ముందే చెప్పేశార్ట. దానికీ ఓ కారణం ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన ఒక్క ఫొటో, వీడియో బయటకు వెళ్లకూడదని కత్రినా – విక్కీలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ పెళ్లికి సంబంధించిన సమస్త ఫుటేజీనీ. ఓ ఓటీటీ కంపెనీకి అమ్మేశారు. అక్షరాలా వంద కోట్లకు. బాలీవుడ్ లో సెలబ్రెటీ పెళ్లికి, అక్కడ తీసిన ఫొటోలకూ, వీడియోలకు మంచి డిమాండ్ ఉంది. కాకపోతే… ఎప్పుడూ వంద కోట్లకు బేరం కాలేదు. అందులోనూ ఓటీటీ సంస్థ ఓ పెళ్లికి సంబంధించిన ఫుటేజీని వంద కోట్లకు కొనుగోలు చేయడం.. నిజంగా ఓ రికార్డే. డిసెంబరు 9న ఈ పెళ్లిని సదరు ఓటీటీ సంస్థ లైవ్ లో చూపించబోతోంది.