చిలకలూరిపేట రాజకీయం పుల్లారావు వర్సెస్ విడదల రజని అన్నట్లుగా సీరియస్ గా సాగుతోంది. మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని విడదల రజని ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. ఆమె ప్రెస్మీట్ లో చాలా విషయాలు చెప్పారు. పుల్లారావు పేరును ఓ వంద సార్లు ప్రస్తావించి.. వేలు చూపించి మరీ హెచ్చరికలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డిలాగే తాను కూడా ముఫ్పైఏళ్లు రాజకీయం చేస్తానని వడ్డీతో సహా చెల్లిస్తానని సవాల్ చేశారు. ఇంతగా విడదల రజని ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారో చాలా మందికి తెలియదు. కానీ ఆమె ఒత్తిడికి గురవుతున్నారన్నది మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది.
విడదల రజనిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది పుల్లారావే. ఆమె అక్కడ పరిచయం అయిందో కానీ ఓ మహానాడు వేదికపై మాట్లాడేందుకు పుల్లారావు అవకాశం కల్పించారు. ఆ వేదిక మీద రజని తన ప్రతిభా ప్రదర్శన చేశారు. జగన్ ను రాక్షాసుడితో పోల్చారు. చంద్రబాబు నారు పోసిన సైబరాబాద్ లో పెరిగిన మొక్కనని చెప్పుకున్నారు. ఆ స్పీడ్ తో ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. తర్వాత నేరుగా చిలుకలూరిపేట సీటుకే టెండర్ పెట్టారు. టీడీపీలో కుదరదని చెప్పడంతో వైసీపీలో సీటు ఆఫర్ రాగానే చేరిపోయారు. అయితే రాజకీయం అంటే పిండుకోవడమే అనుకున్నారేమో కానీ పదేళ్ల కాలంలో అదే పని చేశారు. చివరికి చిలకలూరిపేటలో డిపాజిట్లు కూడా రావని గుంటూరు పంపిస్తే అక్కడా అదే పరిస్థితి. అందుకే మళ్లీ చిలుకలూరిపేట వచ్చారు
కానీ పుల్లారావు ఐదేళ్ల కాలంలో చాలా బాధలు పడ్డారు. ఎన్నికలకు ముందు ఆయన కొడుకును అరెస్టు చేశారు. మనోవేదన కల్పించారు. ఇప్పుడు విడదల రజనిపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. అన్నింటిపై కేసులు పెట్టించడం లేదు. కేవలం కోర్టులు ఆదేశించిన వాటిపైనే కేసులు పెడుతున్నారు. చాలా విచారణల్లో ఆమె డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఆమె బావమరిది మొత్తం సర్దేశారు. ఇప్పుడు ఆయన పారిపోయారు. ఇదంతా బయటకు వస్తూండటంతో పుల్లారావును బెదిరిస్తున్నారు విడదల రజని.