చిలుకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ సొంతపార్టీ హైకమాండ్‌ను కాకాపట్టేందుకు పొగడ్తల్లో పీహెచ్డీ చేశారని చెబుతూ కొద్ది రోజుల కిందట ఎన్టీవీ న్యూస్ చానల్ చిడతల రజనీ అనే టైటిల్ పెట్టి స్టోరీ ప్రసారం చేసింది. ఈ టైటిల్ విని ఇతరులు నవ్వుకున్నారేమో కానీ విడదల రజనీ మాత్రం హర్టయ్యారు. ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎన్టీవీ ప్రో వైసీపీ చానల్ కాబట్టి కన్నెర్ర చేయలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు టీడీపీ సభ్యులు చిలుకలూరిపేట ఎమ్మెల్యేకు నేరుగా చిడతలతోనే షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో వైసీసీ సభ్యులు ఒకటే మిషన్ అమలు చేస్తున్నారు. అదే జగన్‌ను రకరకాలుగా పొగడటం.
ఇందులో ఎవరు క్రియేటివిటీ చూపిస్తే వారికే మంత్రి పదవి దక్కుతుందన్న ఆరాటంలో ఉన్నారు. పొగడ్తలతో అసెంబ్లీ మార్మోగిపోతోంది. ఈ రోజు విడదల రజనీకి చాన్స్ వచ్చింది. ఆమెమాట్లాడుతూంటగా టీడీపీ నేతలు చిడతలు తీసి వాయించడం ప్రారంభించారు. ఓ వైపు జగన్ ను ఆమె పొగుడుతూండగా..దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా చిడతలు వినిపించడం ప్రారంభించాయి. దీంతో ఆమె మాట్లాడటం మానేసి స్పీకర్ వైపు చూశారు. స్పీకర్ చిడతలు వాయించిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి పడేశారు. బయటకు వెళ్లి భజన చేసుకోవాలన్నారు. మొత్తంగా అసెంబ్లీలో ఈ సీన్ మాత్రం హైలెట్ అయిపోయింది.
విడదల రజనీ టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఓ మహానాడులో పాల్గొని ప్రసంగించే అవకాశం పొందిన ఆమె … చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. జగన్‌ను రాక్షసుడన్నారు. ఈ చిడతల ఇష్యూతో ఆవి కూడా ఒక్క సారిగా బయటకు వచ్చాయి. దీంతో విడదల రజనీ ఇంత కాలం సోషల్ మీడియా ప్రచారంతో తెచ్చి పెట్టుకున్న ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఏర్పడింది.