గత నెలలో ప్రెస్ మీట్ పెట్టి పుల్లారావు .. రోజులు లెక్కపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చిన విడదల రజనీ హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి ఆదివారం ఎంపీ కృష్ణదేవరాయుల మీద ఆరోపణలు చేశారు. ఆయనేదో మహిళా ఎమ్మెల్యే కాల్ లిస్టు అడిగారని తాను ఇప్పించలేదని అందుకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇంకా చాలా ఆరోపణలు చేశారు. దీనిపై ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టిన ఎంపీ లావు కృష్ణదేవరాయులు.. రజనీ ప్రారంభించారు.. ఇక తాను కొనసాగిస్తానని చెప్పి మొదటగా…కేసు బ్యాక్ గ్రౌండ్ వివరాలను బయట పెట్టారు.
స్టోన్ క్రషర్ యజమానుల దగ్గర విడదల రజనీ తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని కేసును వాపస్ తీసుకోవాలని ఓ రాయబారిని సజ్జల, రజని ఎంపీ వద్దకు పంపారు. ఫలానా వ్యక్తి వద్ద డబ్బులు పెడతామని కూడా చెప్పారు. అయితే ఈ విషయంలో కృష్ణదేవరాయులు జోక్యం చేసుకోలేదు. ఈ లాబీయింగ్ ఎక్కడ బయటపెడతారోనని భయపడి ముందుగానే ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. విజ్ఞాన్ సంస్థలేవో భూములు తీసుకున్నట్లుగా కూడాచెప్పారు. కానీ అన్నింటికి కృష్ణదేవరాయులు సమాధానం ఇచ్చారు.
కొసరుగా.. విడదల రజనీ వైసీపీ నేతల దగ్గర వసూలు చేసిన డబ్బుల వివరాలు చెప్పారు. పది మందికిపైగా పేర్లను చెప్పిన కృష్ణదేవరాయులు వారి వద్ద ఒక్కొక్కరి నుంచి కోట్లకు కోట్లు తీసుకున్నారని తిరిగి ఇవ్వడం లేదన్నారు. స్వయంగా పేర్లు కూడా కృష్ణదేవరాయులు చెప్పారు. వారంతా వైసీపీ నేతలేనని కూడా చెప్పారు. మరి ఇప్పుడు వారందరితో కోట్లు ఇవ్వలేదన్న ఖండన ప్రకటనల్ని విడదల రజనీ ఇప్పిస్తే.. కృష్ణదేవరాయులు చేసిన ఆరోపణల్ని ఖండించినట్లవుతుంది. వారు తమ దగ్గర నిజంగానే రజనీ డబ్బులు తీసుకుందని ఇప్పించాలని పోలీసుల వద్దకు వస్తే మరింతగా సమస్యల్లో ఇరుక్కుంటారు.