మాజీ మంత్రి విడదల రజనీ ఎక్కడ తనపై కేసులు పడతాయో అని కంగారు పడుతున్నారు. తన పేరుతో వసూలు చేసిన డబ్బుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో చిలుకలూరిపేటలో ఆమె చేసిన దందాల వల్ల నష్టపోయిన వారంతా తెరపైకి వస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటి గురించి తెలిసిన వెంటనే కేసుల వరకూ వెళ్లకుండా డబ్బులు వెనక్కించేందుకు విడదల రజనీ ఒప్పందం చేసుకుంటున్నారు.
సెంట్ స్థలాల పేరుతో రైతుల్ని తీసుకున్న భూముల పరిహారంలో తన అనుచరుల సాయంతో కొట్టేసినదంతా వెనక్కి ఇచ్చేశారు. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేయాలన్న ఆలోచన విరమించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇతర బాధితులు తెరపైకి వస్తున్నారు. తమ వద్దన్న ఐదు కోట్ల డబ్బులు వసూలు చేశారని కొంత మంది స్టోన్ క్రషర్లు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అక్రమాల పేరుతో వ్యాపారాలను మూయిస్తారని బెదిరించారని.. అప్పటి అధికారులు కూడా సహకిరంచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసుల భయంతో విడదల రజనీ.. డబ్బులు తిరిగి ఇస్తూండటంతో ఇలాంటి వారంతా కేసులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో విడదల రజనీకి ఉక్కపోత ప్రారంభమయింది. ఎంత సొమ్మ అని తెచ్చివ్వాలని.. తాము ఎన్నికల్లో ఖర్చు పెట్టేసుకున్నామని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఆమెపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భయంతో ఇప్పటికే పార్టీ మార్పు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.