చిలుకలూరిపేటలో ఐదేళ్లలో ఎంత సంపాదించారో మీ అంచనాకే వదిలేస్తున్నానని గుంటూరు పశ్చిమ ప్రజలకు తన డాబును ప్రదర్శిస్తున్నారు విడదల రజనీ. ఆమె పెడుతున్న ఖర్చు చూసి.. ఇంత సొమ్ము ఎలా అని సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా కోసమే ఆమె పెట్టే ఖర్చు నెలకు రూ. కోటిపైనే ఉంటుందని చెబుతున్నారు. ఇక హోర్డింగ్లు..ఫ్లెక్సీలు.. ఇతర ప్రచారాలకు రూ. కోట్లు వెదజల్లుతున్నారు.
ఇక పార్టీ నేతలకు కూడా డబ్బులు పంచుతున్నారు. అదీ కూడా స్థాయిని లక్షల్లో ఇస్తున్నారు. ధూం..ధాంగా ప్రచారం చేయాడానికి రోజువారీ కూలీలను వందల్లో తెచ్చుకుంటున్నారు. అసలు ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఇంతగా ఖర్చు పెడుతున్న రజనీ వ్యవహారశైలి చూసి గుంటూరు పశ్చిమ ప్రజలకు కూడా … అనేక సందేహాలు వస్తున్నాయి. చిలుకలూరిపేటలో ఎంత సంపాదిస్తే..ఇక్కడ ఇలా ఖర్చు పెడుతున్నారని చర్చ జరుగుతోంది.
చిలుకలూరిపేటలో జరిగిన వ్యవహారాలపై ఇప్పుడు గుంటూరులో హాట్ టాపిక్ అవున్నాయి. ఒక వేళ ఆమె గెలిస్తే… గుంటూరులో ఉండే వ్యాపారస్తులంతా.. పర్సంటేజీలు రెడీ చేసుకుని నేరుగా సమర్పించుకోవాల్సిందేనని…లేకపోతే ఏం జరుగుతుందో చిలుకలూరిపేట నుంచి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే.. గుంటూరులోనే కాదు.. రాష్ట్రంలో మరే వైసీపీ నేత కూడా ఈ స్థాయిలో ఖర్చు చేయడం లేదు. విడుదల రజనీ మాత్రమే.. పెట్టుబడి ఎక్కువగా పెట్టేస్తున్నారు.