లావు కృష్ణదేవరాయుల్ని ఉద్దేశపూర్వకంగా వదిలించేసుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు నర్సరావుపేటలో ఎవర్ని పెట్టాలా అని టెన్షన్ పడుతున్నారు. చివరికి ఆయన చూపు గుంటూరు ప శ్చిమకు బదిలపై వచ్చిన చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై పడిందంటున్నారు. గుంటూరు పశ్చిమలో విడదల రజనీ రంగలోకి దిగిపోయారు. కానీ అక్కడ మొదటి నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. చిలుకలూరిపేటలో ఆమే చాలా ఘనకార్యాలు చేసిందని అందుకే గుంటూరు వచ్చిందని.. ఇక్కడెన్ని చేస్తారో అన్న ప్రచారం జరగడంతో పరిస్థితి మారిపోయింది.
అభ్యర్థుల్ని మార్చినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో విడుదల రజనీని మారుస్తారన్న ప్రాచరం ఊపుందుకుంది. ఇప్పుడు ఏకంగా నర్సరావుపేట ఎంపీ స్థానానికి ఆమె పేరు పరిశీలిస్తున్నారు. జగన్ రెడ్డి ఇచ్చిందే టిక్కెట్ కాబట్టి విడదల రజనీకి మరో చాయిస్ లేదు. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయాలి. మంత్రిగా సంపాదించుకున్న మొత్తం అండగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఆమె వెనక్కి తగ్గే అవకాశం లేదు.
అయితే విడదల రజనీని కావాలనే బలి పశువు చేస్తున్నారా అన్న సందేహం వైసీపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమెనే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారన్నది వైసీపీ నేతలకు అర్థం కావడంలేదు. చివరికి టిక్కెట్ ఎగ్గొట్టే ప్రాక్టీస్ లో భాగంగానే ఇలా చేస్తున్నారా అన్న సందేహం కూడా కొంతమందికి వస్తుంది. ఆమెకు టిక్కెట్ లేకుండా చేస్తే.. అసలు నియోజకవర్గం లేని నేతగా మిగిలిపోతారు.