విద్యాబాలన్ తొలిసారి చేసిన తెలుగు సినిమా.. ‘ఎన్టీఆర్’. ఈ సినిమాపై తను చాలా నమ్మకం పెట్టుకుంది. తెలుగులో తనకు ఇంతకంటే గొప్ప ప్రారంభం లభించదు… అని నమ్మకంగా చెబుతోంది. అసలు తనకు భాషతో ఇబ్బంది లేకుండా చేశారని, హైదరాబాద్లో నాకంటూ ఓ కుటుంబం ఉందన్న భరోసా కలిగించారని విద్యాబాలన్ పొంగిపోతోంది. అంతేకాదు.. ఈ ఫంక్షన్ సాక్షిగా.. బాలయ్య చేతి మీద ఓ ఆత్మీయంగా ఓ ముద్దు పెట్టింది విద్యాబాలన్. తనని ప్రేమగా చూసుకున్న బాలయ్య కుటుంబ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంది.
అందరికీ నమస్కారం.. ఎలా ఉన్నారు..? “ అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన విద్యాబాలన్.. ఇంకా ఏం చెప్పిందంటే…?
”ఇది నా తొలి తెలుగు సినిమా. ఇంతకంటే గొప్ప ఆరంభం ఉండదనుకుంటున్నా. ట్రైలర్ చూసి ఎమోషనల్ ఫీలయ్యా. బాలయ్య మరో వ్యక్తిగా కనిపించారు. ఆయన ఎనర్జీ, ఫ్యాషన్.. చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా చూసినవాళ్లంతా ఆయన ప్రేమలో పడిపోతారు. ఇది నా జీవితంలోని ప్రత్యేకమైన చిత్రం. మీ ఆశీర్వాదం కావాలి. ఎన్టీఆర్, బసవరతారం ఆశీస్సులు ఈ సినిమాకి ఉండాలి. నాకు భాష రాదన్న భయం లేకుండా చేశారు. హైదరాబాద్లో నాకిప్పుడు ఓ కుటుంబం ఉంది అని చెప్పగలుగుతున్నా. అది బాలకృష్ణగారి కుటుంబం..” అంది విద్యాబాలన్.