నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ చకచకా సాగుతోంది. ఇప్పటికే సినిమా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలావరకూ పూర్తయ్యాయి. శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యా మీనన్ నటించిన సన్నివేశాలను ఇటీవల పూర్తి చేసేశారు. ఒకవేళ ఇద్దరితో సన్నివేశాలు వుంటే ఒకట్రెండు రోజులు మళ్ళీ షూటింగ్ చేస్తే సరిపోతుందట! లాస్ట్ వీక్ షూటింగ్ చేసినవాళ్ళు ఈ వీక్ ఎన్టీఆర్ బయోపిక్ సెట్లో కనిపించడం లేదు. ఈ వీక్ చేసినవాళ్ళు వచ్చే వీక్ సెట్లో వుంటారో లేదో తెలియదు. సెట్లోకి వచ్చి వెళ్ళేవాళ్ళు చిన్నాచితకా నటీనటులు కాదు. స్టార్ స్టేటస్ వున్నవాళ్ళే. వాళ్ళందర్నీ క్రిష్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు. షెడ్యూల్స్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడంతో స్పీడుగా షూటింగ్ జరుగుతోంది. ఈ స్పీడుకు మెయిన్ రీజన్ బాలకృష్ణ. దర్శకుడితో పాటు ఆయనా కష్టపడుతున్నారు. ఆర్టిస్టుల డేట్స్‌ను బట్టి చాలా తెలివిగా క్రిష్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో రెండు మూడు వారాలు షూటింగ్ చేసిన విద్యా బాలన్ మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ సెట్లోకి వచ్చారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్ కాంబినేషన్ సీన్లు తీస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్ర ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రెండు భాగాల్లోనూ వుంటుందని తెలిసింది.