విద్యులేఖా రామన్… పేరుకి తమిళమ్మాయి. తెలుగులోనూ ఈ ఫేస్ వెరీ పాపులర్. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రన్ రాజా రన్’, ‘రాజుగారి గది’, ‘తొలిప్రేమ’ సినిమాల్లో ప్రేక్షకుల్ని ఎంతో నవ్వించిన ఫేస్ ఈమెది. ఇప్పుడు ఎవరో ఈమె ఫేస్బుక్ (ఎఫ్బి) పేజీ హ్యాక్ చేయడంతో ఘొల్లుమంటోంది.
సాధారణంగా సెలబ్రిటీల ఫేస్బుక్ పేజీలు మైంటైన్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని సంస్థలు వున్నాయి. బడా బడా స్టార్లు తమకంటూ ప్రత్యేకంగా కొంతమంది స్టాఫ్‌ని నియమించుకుంటున్నారు. అయితే… విద్యులేఖా రామన్ ఎవర్నీ నియమించుకోలేదు. తానే స్వయంగా ఫేస్బుక్ పేజీని మైంటైన్ చేస్తున్నార్ట. వున్నట్టుండి ఎవరో ఆమె పేజీని హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి రమ్య పేరుతో ఆ పేజీని మార్చేశారు. ఈ మార్పు ఎలా జరిగిందో అర్థం కాక విద్యులేఖా రామన్ తల పట్టుకున్నారు. ట్విట్టర్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఎవరో దొరుకుతాడని, పెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేస్తానని పేర్కొన్నారు.