విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఇలా ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై విజిలెన్స్ దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చిలుకలూరిపేట నియోజకవర్గంలో స్టోర్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి ముందుగా కప్పం కట్టాలని సమాచారం పంపారు. వారు కట్టలేమనడంతో అక్రమ మైనింగ్ చేశారని అధికారులతో రూ. 50 కోట్ల ఫైన్ వేయించారు. దాంతో ఆ వ్యాపారులు కాళ్ల బేరానికి వచ్చారు. పోలీసు ఆఫీసర్ అయిన జాషువా వారిని బెదిరించారు. అందరూ కలిసి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసుకున్నారు. ఇందులో రెండు కోట్లు విడదల రజని, పది లక్షలు ఆమె పీఏ, మరో పది లక్షలు పోలీసు అధికారి జాషువా తీసుకున్నారు. విజిలెన్స్ దీన్ని నిర్దారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ప్రభుత్వం ఇప్పుడు విజిలెన్స్ నివేదికపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసులు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకుంటే.. జైలుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆమెపై చాలా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బులు తిరిగి ఇచ్చారు. కానీ ఇంకా పదికిపైగా ఫిర్యాదులపై విచారణ జరగాల్సి ఉంది.