ఐపీఎల్ యంగ్ ట్యాలెంట్ కి గొప్ప వేదిక. ఈ సీజన్ రెండో రోజే ఓ కొత్త కుర్రాడు మెరిసాడు. అతడే..విగ్నేష్ పుత్తూర్. కేరళకు చెందిన విగ్నేశ్ కి డొమస్టిక్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు .2024లో కేరళ క్రికెట్ లీగ్‌లో ఆలప్పుజ రిపుల్స్ తరపున ఆడిన విగ్నేశ్ తన మణికట్టు మాయజాలంతో ముంబై ఇండియన్స్ సెలక్టర్స్ ని ఆకర్షించాడు. ముంబై టీం ఈసారి వేలంలో రూ. 30 లక్షలకు అతన్ని సొంత చేసుకుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన విగ్నేష్, 32 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసుకుని అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
విగ్నేష్ ది దిగువమధ్య తరగతి కుటుంబం. తండ్రి సునీల్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ విగ్నేశ్ ని క్రికెట్ లో ప్రోత్సహించాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఓటమి పాలైనప్పటికీ విగ్నేశ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్ ఆనంతరం ధోని, విగ్నేశ్ భుజం తట్టడం మరో హైలెట్. ఐపీఎల్ లో ముంబై డ్రీం టీం. ఆ టీం తరపున ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్ లోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేయడం టాక్ అఫ్ ది క్రికెట్ గా మారింది.