అర్జున్ రెడ్డితో స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు గీత గోవిందంతో మరో మెట్టు పైకి ఎక్కాడు. విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రమేపీ పెరుగుతోంది కూడా. అందులో అమ్మాయిలూ ఉన్నారు. వాళ్లందరికీ ఓరకంగా చేదు వార్త! విజయ్ ప్రేమలో పడిపోయాడు. ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు టాలీవుడ్ టాక్. ఓ ప్రధాన పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ… ఓ అమ్మాయి గురించి గొప్పగా చెప్పాడు విజయ్. చిన్నప్పటి నుంచీ ఓ అమ్మాయి తనని బాగా ప్రోత్సహించిందని, తన స్నేహం దక్కడం అదృష్టమని, తన తల్లితండ్రులు, మిగిలిన స్నేహితులు కూడా అదృష్టం చేసుకున్నారని ఆ అమ్మాయి గురించి అభివర్ణించాడు. అంతేకాదు… `తను ఓ దేవత` అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. దాంతో ఆ అమ్మాయి ఎవరన్న ఆరా ఎక్కువైంది. ఆ అమ్మాయితో విజయ్ ప్రేమలో ఉన్నాడని, అందుకే ఈ తరహా కామెంట్లు చేశాడని చెప్పుకుంటున్నారు. యూత్‌తో ప్రేమ గోల మామూలే. కెరీర్ స్పీడుమీద ఉండగానే హీరోలు.. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని సెటిలైపోతున్నారు. మరి విజయ్ కూడా అదే దారిలో వెళ్తాడా? చూడాలి మరి.